పుట్టలో కిట్టయ్య(బాల గేయము)-ఎడ్ల లక్ష్మి-సిద్దిపేట
ఊరికి ఊరికి కిట్టయ్య
ఉట్టి నీవు కోట్టయ్య

వెనకకు తిరిగి చూడయ్య
వెన్న గురుగు లున్నాయి

గురిగిలో వెన్న తినవయ్య
గుట్టుగా నీ ఉండయ్య

పట్ట బోతే కిట్టయ్య
పుట్టలోన దూరయ్య

ఆకలి అయితే కిట్టయ్య
ఆవు వస్తుంది చూడయ్య

పుట్టలో నీకు కిట్టయ్య
పాల దారలు పోస్తుంది

కమ్మని పాలు తాగయ్య
కలియుగాన్ని కాపాడయ్య