చిలుకా పిచ్చుక (బాల గేయం):-ఎడ్ల లక్ష్మి . సిద్దిపేట
సూరు లోన ఉన్నది ఊర పిచ్చుక
రామ్మని పిలిచింది రామ చిలుక

బిర బిర వచ్చింది ఊరపిచ్చుక
బియ్యమే చల్లింది రామచిలుక

గబ గబ బుక్కింది ఊరపిచ్చుక
చిన్నగా నవ్వింది రామచిలుక

చిట్ట చిట్ట ఎగిరింది ఊరపిచ్ఛుక
మొట్టికాయలేసింది రామచిలుక

సూరు లోన దూరింది ఊరపిచ్చుక
చేట్టు మీద చేరింది రామచిలుక

పోద్దున్నే లేచింది రామచిలుక
పొద్దుకే మొక్కింది చిట్టి చిలుక