సూరన్న ' సిరి '...!!:- ----డా .కె .ఎల్.వి .ప్రసాద్ ,హన్మకొండ .
సూరన్న వచ్చాడు 
సూర్యోదయం 
అయింది .....
సూర్యరశ్మిని తెచ్చి 
చీకటిని 
తరిమి కొట్టాడు 
సకల ప్రాణకోటినీ 
నిద్రలేపి ....
నిత్య జీవిత కృత్యాలకు 
తెర లేపి పెట్టాడు !
మనుష్యకోటికి 
ఉదయపు లేతెన్డ
సూర్యకిరణాలతో 
డి -విటమిను 
ప్రసాదించి ....
ఉచిత ఆరోగ్య పథకానికి 
శ్రీకారం చుట్టాడు !
పశు పక్ష్యాదులలో
చైతన్యం రేకెత్తిన్చి
నిత్య జీవన స్రవంతికి 
నీరాజనం పలికాడు !
చెట్టు ఆకులలోని 
పత్రహరితం పై 
ప్రభావం చూపించి 
కిరణజన్య సంయోగ క్రియతో 
ఆమ్లజని (ప్రాణ వాయువు )
పుట్టించి ....
జీవకోటినెల్ల 
సజీవులను చేసినాడు !

కృత్రిమ విద్యుత్తుకు 
కేంద్రబింధువు అతడు 
సూరన్న కాక మరి ,
ఇంకెవరు కాగలరు ?

   


కామెంట్‌లు