చేతికందిన సమ్మోహనాలు :-- ఎం. వి. ఉమాదేవి నెల్లూరు

ముక్త పదగ్రస్తమును 
పద గ్రస్త అందమును 
అందముగ మలిచిరి   సమ్మోహనములు ఉమా !

ప్రాచీన, ఆధునిక 
ఆధునిక తీరులిక
తీరుగా నింపితిరి చిరుకవితలో ఉమా!

అంశమే గీర్వాణి 
గీర్వాణ విరిబోణి 
విరితావి మధురిమల కవితలివి ఓ ఉమా!

తెలుగులో పదములను 
పదబంధ సూత్రమును 
సూత్రమున బంధించె సమ్మోహనం ఉమా!

వ్రాయగా కౌతుకము 
కౌతుకమే  సుకృతము 
సుకృతము పొందితిరి కవులంతా ఓ ఉమా!!

కామెంట్‌లు