లింగారాధన-కార్తీకమాసం ప్రత్యేకం. డా.బెల్లంకొండనాగేశ్వరరావు.

 మోక్షసాధనకువైరాగ్యం,భక్తి,జ్ఞానంప్రధానమార్గాలుఅంటారుపెద్దలు.లింగారాధనఈసృష్టిలోఅత్యంతప్రాచీనమైనది.బ్రహ్మ,విష్ణు,శ్రీరాముడు,శ్రీకృష్ణుడువంటివారేలింగారాధనచేసినట్లుపురాణాలద్వారాతెలుస్తుంది.ఆకృతినిబట్టటి,ఛాయనుబట్టి లింగవిభజనజరుగుతుంది.అవి...."ఆట్యం"-"సారోట్యం"-"అనాట్యం"-"సర్వసమం"అని నాలుగురకాలుగాపిలువబడతాయి.
వేయి ఓకముఖం కలిగినలింగాన్ని"ఆట్యలింగం"అని.నూటఎనిమిది ముఖాలుకలిగినలింగాన్ని""సారోట్యలింగం" లేక "అష్టోత్తరలింగం" అనికూడాఅంటారు.ఒకటినుండి ఐదుముఖాలు కలిగిన లింగాన్ని"సర్వసమలింగం" అంటారు.మనకు విరివిగా కనిపించేవి "అనాట్యలింగం"అంటే ముఖం లేనిలింగం.శ్రీకాళహస్తి-కాశీ-శ్రీశైలం లోలాగా.
ఏకముఖంనుండి పంచముఖంకలిగిన శివలింగఆలయాలు అపూర్వమని చెప్పవచ్చు.పానవట్ట ఉపరిభాగంలో అమర్చిన ముఖాలనుబట్టిలింగవర్ణన జరుగుతుంది.ఆరుముఖాలుకలిగిన "షణ్ముఖలింగం" కూడాఉంది . కాని దీనిని ఆరాధించడం మనసాంప్రదాయంలో లేదు.పానవట్టనికి పైభాగాన రెండుచేతులతో శివుడు నడుములవరకు అమర్చిన ముఖలింగాలు మనకు కొన్నిచోట్ల దర్శనమిస్తాయి.
"ఏకముఖలింగం"తూర్పుముఖంగాఉండి తెల్లనిఛాయతో అవధులులేక ప్రసరించేశక్తికలది.ఈలింగాన్ని"తత్పురుషం"అంటారు.ఇవి "తిరువన్నామలై"లో అరుణాచలేశ్వరునిఆలయంలో పెరియనాయగర్ సన్నిధికి నైఋతిమూలలో అతిసుందర ఏకముఖలింగంఉంది.అలాగే "చిదంబరం"లోనూ సుచీంద్రంధానుమాలస్వామి ఆలయంలో ఏకముఖలింగాలను మనం దర్శించుకోవచ్చు.
"ద్విముఖలింగం"తూర్పు-పడమరగా అమర్చబడి తూర్పుముఖాన్ని తత్పురుషం,గా,పడమరముఖాన్ని"సాద్యోజాతం"గాపూజింపబడుతుంది.
"త్రిముఖలింగం"పానవట్టపైభాగంలోతూర్పుముఖంతత్పురుషం,ఉత్తరదిక్కుముఖాన్ని"వాయుదేవము"అని,దక్షణదిక్కుముఖాన్ని"అఘోర"అనిపిలుస్తారు.ఈలింగం తూర్పుముఖం చిరునవ్వుతోనూ,ఉత్తరముఖం బంగారు రంగుతోమందహాసంతోనూ,దక్షణముఖం ఉగ్రరూపంతోను మలచబడిఉంటాయి.బ్రహ్మ,విష్ణు,మహేశ్వరులకు ప్రతిరూపంగా-సత్య-రజతమోగుణాలకుప్రతీక.ఈత్రిముఖలింగంతమిళనాడులోనిదిండివనంవద్దఉన్న"తిరువాక్కరై"క్షేత్రంలోని"చంద్రమౌళిశ్వర"ఆలయంలోమాత్రమే చూడవచ్చు.ఈభూమండలంలో అంతటిలోనూ ఉన్న ఏకైక త్రిముఖలింగ ఆలయం ఇదిఓక్కటే.ఇలామలచిన విగ్రహాలు ఎలిఫెంటాగుహలలో
(ముంబాయి)దుండగులచేతిలోశిధిలమైకనిపిస్తాయి.అలానే ఇటువంటి పోలికలుకలిగిన  త్రిముఖం "ఇండోనేషియా"లో ఉంది.ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన "త్రయంబకలింగం"ముమ్మూర్తులా ఇలానేఉంటుంది.
"చతుర్ముఖలింగం"పానవట్టపై నాలుగుముఖలింగాలుకలిగి ప్రతిష్టింన దేవాలయాన్ని."సర్వతోభద్రాలయం"అంటారు."తిరువన్నామలై"-"తిరువానైక్కావల్"-కంచిలోని "కచ్చపేశ్వర"ఆలయాలలో ఈచతుర్ము ఖలింగాలను దర్మించుకోవచ్చు.(ఇవన్ని తమిళనాడులోఉన్నవి) ఈలింగాన్ని "వేదలింగం" అనికూడా అంటారు.పడమరముఖాన్ని "సద్యోజాతాది"అంటారు.
"పంచముఖలింగం"ఈలింగానికి నలు దిశలతో పాటు,లింగంపైభాగాన (అంతర్ముఖంగా)ఆకాశంకేసి చూస్తున్నట్లు ముఖరహితంగా ఉంటుంది. తమిళనాడులోని "వేలూరు"లోని"మార్గసహాయేశ్వర" ఆలయంలోనూ, నేపాల్ లోని"పసుపతినాద్" దేవాలయంలోచూడవచ్చు .ఈలింగానికి పైభాగాన ఉన్నముఖాన్ని"ఈశాన"అంటారు.
ముపైఆరుముఖాలుకలిగిన లింగం తమిళనాడులోని మహాబలిపురంలో ఉంది.విచిత్రలింగాలు:పిఠాపురంలోని "కుక్కుటేశ్వరుడు" స్వయంభూవులింగం. ఈలింగానికి ఇరువైపులా 'రెక్కలు'ఉంటాయి. ఈక్షేత్రాన్ని "పాదగయా"అనికూడా అంటారు.
కాళేశ్వరము:ఒ కేపానవట్టంపై రెండులింగాలు దర్శించుకోవచ్చు.లింగానికి నాసికరంధ్రాలుఉంటాయి.ఈలింగం నాసిక రంధ్రాలలో ఎంత అభిషేక జలంపోసినా ఓక్కచుక్కజలం వెలుపలకురాదు.
మంథాని:ఒకేపానవట్టంపై పదకొండు లింగాలు ఉంటాయి.ఇక్కడ ఒకే విగ్రహంలో పదకొండు నందులు చూడవచ్చు.ఈఆలయనిర్మాణ రాళ్లు నీటిపైతేలడం విషేషం.గోవా: చంద్రనాద్ ఇక్కడ ప్రతిపౌర్ణమికి లింగంపై వెన్నెలపడుతుంది .ఆసమయంలో లింగంనుండి నీరు ఉబుకుతుంది. స్వామిపేరు చంద్రేశ్వరుడు.
పంచరామాలు తెలుగు నేలపైనేఉన్నాయి.పంచభూతలింగాలు:క్షితిలింగం  (కంంచి)ఆకాశలింగ (చిదంబరం)జలలింగం (జంబుకేశ్వరం)తేజోలింగం (తిరువన్నామలై)వాయులింగం(శ్రీకాళహస్తి)
పెదపులివర్రు:ఇది తెల్లని పాలరాతిలింగం మకర సంక్రాంతి రోజు సూర్యోదయకిరణాలు లింగంపై ప్రసరింపబడతాయి.కిన్నెరకైలాస పర్వతలింగం ఇది వాతావరణానికి అనుగుణంగా రంగులు మార్చుకుంటుంది.చెన్నయ్ లోని "వవివాంబిక"-దేవికరుమారిఅమ్మన్"కొటిలింగాలపల్లిలోనూ,కాశీలోనూ,"అష్టోత్తరలింగాలను"దర్శించుకోవచ్చు."త్రికోటేశ్వరుడు"గా మీసాలకోటయ్య ,కోటప్పకొండలోనూ, అమరనాధ్-గోకర్ణంవంటి పలుప్రాంతాలలో ప్రజలను శంకరుడు పరవశింపజేస్తున్నాడు.
లింగాకారంకాకుండా పార్వతిదేవి మనోహరుడు మానవరూపంలో కనిపించేదేవాలయాలు రెండూ తెలుగునేలపైఉన్నాయి.ఒకటి అనంతపురంజిల్లా అమరాపురమండలం హేమావతి గ్రామంలోని "సిద్దేశ్వరఆలయం"రెండవది చిత్తూరుజిల్లా నాగలాపురమండలం సురుటుపల్లిగ్రామంలో స్వామి పవ్వళించి కనిపిస్తాడు.ఈఆలయంలోనే సతీసమేత "దక్షణామూర్తి"కనిపిస్తారు.మరెకక్కడ దక్షణామూర్తి సతి సమేతంగాకనిపించడు.శివభక్తులను నయనార్లు అంటారు.ఇటువంటి మహిమాన్విత,మనోహర సుందరరూపలింగాలు ఆసియా లో ఎన్నోకనిపిస్తాయి.ఏరూపంలోకొలిచినా,ఏబాషలో వేడుకున్నా, ఏగుడిలోమొక్కినా ఫలితం ఓక్కటే.నదులన్ని సాగరం చేరినట్లే పూజించేవారంతా ఆసదాశివుని చేరుకోవలసిందే!దేవదేవునికృపకు అందరూపాత్రులే.అదే మానవజీవితపరమార్ధం
"హరహరమహదేవ శంభోశంకరా"