నాగుల పంచమి (మణి పూసలు)-ఎడ్ల లక్ష్మి-సిద్దిపేట

భక్తులంత వచ్చి జేర
పుట్ట లోన పాలధార
తడిసి కూలె పుట్టంత
పాము కేది ప్రాణ ధార

పుట్టలోన ఉండలేక
బయటికేమో రాలేక
మట్టి కింద ఇరికి పోయి
బ్రతక లేక సావలేక

దాని బాధ చూసారా
భక్తులార వింటారా
పాలు పోయనాపిమీరు
కళ్ళతో చూడ లేరా

పసుపు కుంకుమలు బెట్టి
పాలకాయలను గొట్టి
చేతుల నెత్తి యచట
దండాలు మీరు బెట్టి

నాగుల పూజలు జేసి
పాముకు ప్రాణము బోసి
పుణ్య ఫలములు నొంది
మురవాలి మీరు చూసి

అలా చేయండి పూజలు
వారు నిజమైన భక్తులు
భువిమీది పాములకు
కలిగించు తిరుగు తోవలు