అర్ధనారీశ్వర స్వరూపమై
శక్తి లేనిదే శివుడు లేడు
శివుడు లేనిదే శక్తి లేదని
తమ మహిమలతో
చాటిచెప్పిన వైనాలన్నీ
మానవజాతికి సందేశాలే!!
అర్ధనారీశ్వర శిరస్సున ఉండే
చంద్ర రేఖ ఓ గొప్ప భూషణం!!
ఓ రుషీశ్వరుడికి
అర్ధనారీశ్వర కనులలో
ఎర్రజీర అదృష్ట చిహ్నం!
కనులలో కరుణ రసం
సకలప్రాణికోటికీ జీవరసం!!
అర్ధనారీశ్వర శరీరంపై
సుగంధం పూత
సౌభాగ్యానికి చిహ్నం!!
సౌందర్యలహరి
శివానందలహరి
సమ్మిళితమే అర్ధనారీశ్వర
జీవనగీతం!!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి