అచ్చులతో మణి పూసలు( బాల గేయం ):-ఎడ్ల లక్ష్మి-సిద్దిపేట
అమ్మ భాష కమ్మగా
ఆటలాడుచుండగా
ఇంటిలోని పాపాయి
ఈ భాషను నేర్చుగా

ఉమా రమా చూడగా
ఊయలెక్కి ఊగగా
రుక్కమ్మ వచ్చి చూసి
రూపాయలు నిచ్చెగా

లుంగి బాబు వచ్చాడు
లూటి మాపి చేసాడు
ఎగురుతూ దూకుతూ
ఏనుగు పై నెక్కాడు 

ఒంటి కన్ను పిల్లోడు
ఓంకారం పలికాడు
ఔషధాలు పట్టుకొచ్చి
వారికేమొ ఇచ్చాడు

అందరొచ్చి చూసారు
ఆః యంటూ నవ్వారు
ఎంత మంచి ఔషధం
కరోననే  తరి మారు