కన్యలంతా నల్లపూసలై
శుల్కమే సూత్రమై
బానిస మెట్టెలు తొడగబడుతాయి.
కన్యాదానం విక్రయమై
ఎవరెక్కువిస్తే వారికి వశమవుతుంది.
అవ్యవస్థ తయారయ్యి
ఆలోచన అంతమయ్యి
స్త్రీకి అస్తిత్వం నశిస్తుంది.
అంగడిలో సరుకై విక్రయించబడుతుంది.
గౌరవం కోల్పోయి గారడీబొమ్మవుతుంది.
పురుషాధిక్యత మరింత పెరిగి
అసమానతలు పెచ్చు మీరుతాయి.
ఎదురిచ్చే శుల్కం శూలమై గుచ్చి,
శూన్యం మిగులుస్తుంది.
అనుబంధం బజారు వ్యాపారమై,
వివాహం విచక్షణ కోల్పోయి
తల్లిదండ్రుల పాలిట మరో శాపమవుతుంది.
కన్యాశుల్కం కాష్ఠమై నిలుస్తుంది.