అస్త్రం ...!!:- -------డా .కె .ఎల్వీ . హన్మకొండ .
చలి కాలం
అయిపోయింది ,
చలిపులి 
తోకముడిచింది.

రగ్గులు -దుప్పట్లు 
స్వెట్టర్లు -మఫ్లర్లు 
తెరవెనక్కు 
జరిగాయి .....
గీజర్ కు -
పని తగ్గిపొయింది 
వేడి నీళ్ల అవసరం 
ఏముంటుంది ?

వేసవికాలం 
ప్రవేశించింది ,
చెమటలు -
ఉక్కబోతలతో 
స్వాగతం పలికింది 

చుపంతా --
విసన కర్రలు 
పంకాలు -కూలర్లు 
ఏ .సి లవైపు 
మళ్లింది ......!

ఋతువులు మారిన 
వాతావరణం 
రంగులు మార్చినా 
మరువరానివి 
ఉన్నాయి కొన్ని 
అవి ఆరోగ్యాన్ని 
సంరక్షించే ఆయుధాలు !

అవే ......
మూతికి ' మాస్కు '
చేతులకు .....
శానిటైజర్ ......
మనుష్యుల మధ్య ,
భౌతిక దూరం .....
మరచిపోకుండా 
ఆవిరి పీల్చడం ....!

ఇవిమాత్రం ...
మరువబోకు నేస్తం !
కరోనా కట్టుబాటుకు ,
ఇదేమంచి అస్త్రం !!