తపన ....!!:- -------డా.కె.ఎల్.వి.ప్రసాద్- హన్మ కొండ .

 కాయకష్టం కోసమో 
బ్రతుకు పోరాటంకోసమో 
ఆకలిఆరాటం తోనో 
అతని పయనం 
మొదలైంది ....
అడుగులు ముందుకి 
ఆలోచనలు 
వెనక్కీ -ముందుకి ...!
అతని నిర్ణయం 
దృఢమైంది ......
అతని మార్గం క్లిష్టమైన్ది,
అయినా----
ఆశాజీవిగా అడుగులు 
ముందుకువేస్తున్నాడు 
అతనిపై అతనికి అంత,
గట్టినమ్మకముంది !
సరిపడా వళ్ళుకప్పుకోడానికి 
తనకి సరైన గుడ్డ లేకపోయినా ,
బిడ్డఎదిగేలోపు ...
గట్టి గుడ్డముక్క కప్పాలని ,
ఆ..తండ్రి ఆశ....
ఆకలిని తట్టుకునే,
ఆత్మ స్తైర్యం...
కడుపునిన్డా నిమ్పాలని
ఆ...తండ్రి తపన....!
ఆ.బాటసారి 
సంకల్ప సాధన....!!