కందనూరు అనే ఊరిలో ఓ ముసలి తాత ఆయన మనవడు రాము ఉండేవారు.
తాతగారు తనకు శక్తి వున్నంత వరకు బర్రెలను, ఆవులను కాస్తూ పాలు అమ్మి ఇల్లు గడిపేవాడు.రాము మాత్రం ఎప్పుడూ పగటి కలలు కనేవాడు.
ఒక రోజు ఆ ఊరిలో తిరునాళ్ళు జరుగుతోంది.బంధువులు వస్తారు కాబట్టి ఎక్కువపాలు కావాలనిపాలుకొనేవారు అడిగారు.అది విన్న రాము అప్పటి నుండి కలలు కనడం ఇంకా ఎక్కువయింది."నువ్వు పగటి కలలు ఆపేయారా! "అన్నాడు తాత.
"అది కాదు తాతా!మనం ఈ పాలు అన్ని అమ్మితే ఎక్కువ డబ్బులు వస్తాయి.ఆ డబ్బులతో మనం ఇంకా ఎక్కువ పశువులను కొనవచ్చు. వాటి పాలు అమ్మి మంచి ఇల్లు కట్టుకో వచ్చు" అన్నాడు రాము.
"సరే కానీ…నువ్వు ముందు ఈ పాలను జాగ్రత్తగా చేర్చు.నువ్వు కలలు కంటూ పొరపాటున క్రింద వేస్తే నష్టం వస్తుంది" అన్నాడు తాత.
"సరే తాతా"అంటూ రాము తలమీద పాల కుండను పెట్టుకుని దారి పట్టాడు.దారిలో పోతుండగా మధ్యలో రాము మళ్లీ కలలు కనడం మొదలు పెట్టాడు .తల పైన వున్న పాల కుండ బాగా ఊగుతూ క్రింద పడిపోయింది.అది చూసి రాము భోరున ఏడ్చాడు.
"ఇప్పుడు నేను ముందుకు వెళ్లాలా...?వెనక్కి వెళ్లాలా....?" అంటూ ఏడుస్తు బాధతో ఇల్లు చేరాడు.తాతకు విషయం చెప్పాడు.
తాత, రాముతో "జీవితంలో మంచి స్థాయికి ఎదగాలని కలలు కనడం తప్పు కాదు కానీ. ఆ కలలను నెర నేర్చుకునే దిశగా కృషి చేయాలి.ఆ కలలు పగటి కలలు కారాదు." అన్నాడు.
అప్పటి నుండి రాము పగటి కలలు కనడం మాని,తన కోరికను సాధించుకునే దిశగా కృషి చేయటం ప్రారంభించాడు..
పండుగాయల సుమలత.
గొట్లూరు.కర్నూలుజిల్లా
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి