'పబ్లిక్ బ్యాంక్'... :- ఎన్నవెళ్లి రాజమౌళి ;- కథల తాతయ్య


 బావా నేను కరీంనగర్లో పబ్లిక్ బ్యాంకులో ఉద్యోగం చేస్తా. అని అని మా బావతో అనగానే-ఎందుకురా... ఇప్పుడే ఉద్యోగం. ఆ డిగ్రీ ఏదో పూర్తి చెయ్. సంవత్సరం అయితే... చూద్దువు గాని... అన్నారడు. నాకు పెళ్లయే.. ఖర్చులు పెరిగాయి. అన్నాను. సరే! అని బావ అనడంతో... పబ్లిక్ బ్యాంకులో దరఖాస్తు పెట్టాను. సిద్దిపేట లనే బ్యాంక్ బ్రాంచ్ తెరిచారు. నాకు క్లర్కుగా నియామక పత్రం ఇచ్చారు. ఫీల్డ్ మీదికి వెళ్లడం.. డబ్బులు జమ చేయడం నాపని. మూడు నెలలు మంచిగానే నడిచింది బ్యాంక్. తర్వాత ఎవరికీ చెప్పకనే ఎత్తివేశారు. డబ్బుల కొరకు వచ్చి మేనేజర్ శివ స్వామిని అడిగారు. నాకు ఏమీ తెలవదు నేను మీ దగ్గరకు రాలేదు.అన్నాడు వినియోగదారులతో... గ్రాండ్ హోటల్ కు శివ స్వామి స్నేహితుడు మమ్ములను అందరిని రమ్మన్నాడు. అక్కడ ఆయన మా శివ స్వామి పైన ఈగ వాలినా ఊరుకోను అన్నాడు. శివ స్వామి స్నేహితుడికి సిద్దిపేటలో భయపడతారు. ఇక మిగిలింది నేను. నా వెంబడి పడ్డారు. నేను నేను ఏమి చేయలేను అర్థం కాక, బయటకు వచ్చి నిలబడ్డాను. సెకండ్ షో చూసినవాళ్లు వెళ్తున్నారు. మా తడకపల్లి వాళ్లు కూడా అందులో ఉన్నారు. దగ్గరికి వెళ్లి వాళ్ళ సైకిల్ పై ఎక్కి తడకపల్లి లో పడ్డాను. నెల రోజుల వరకు సిద్దిపేటకు వెళ్లలేదు. నన్ను ఎవరు మళ్లీ అడగలేదు. ఎవరు మా ఇంటికి రాకపోయేసరికి... అమ్మయ్య అని అని ఊపిరి పీల్చు కున్నాను.