'మిత్రుడిని మిసైనాను'...:- ఎన్నవెళ్లి రాజమౌళి - కథల తాతయ్య


 చదవమంటే చదవవు.... ఏ పని చెప్పినా వినవు... మీ నాన్న ఎట్లుండే... నీవు ఎలా ఉన్నావ్ రా... ఆయన టీచర్ గా ఎంతో పేరు తెచ్చుకున్నారు. ఆయన చనిపోవడం ఏమో కానీ, ఉన్నబాధ అంతా నాకు పెట్టి పోయిండు.. అంటూ అమ్మ కన్నీళ్లు పెట్టుకుంది. నేను చప్పుడు చేయలేదు. ఏమనుకుందో ఏమో... సరే! ఈ డబ్బు బట్టల దుకాణం లో ఇచ్చిరా. అంటూ నాలుగు వందల రూపాయలు ఇచ్చింది. సిద్దిపేటకు వెళ్లాక.. తిట్టిందని బాధపడ్డాను. ఉండనే వద్దని హైదరాబాద్ బస్సు ఎక్కాను. బస్సు ఎక్కాను కానీ, ఒకటే ఏడుపు. ఏమి చేయాలి. ఎలా బతకాలి. అని, శామీర్పేట చెరువు కాడికి వెళ్లేసరికి లైట్లతో సిటీ ఎంత మెరుస్తుంది. నింగిలోని నక్షత్రాలు నేల మీదకు వచ్చి వెలుగుతున్న వా..అని, అనిపించింది. హైదరాబాద్ బస్టాండ్ లో అందరూ దిగుతున్నారు. నేను కూడా దిగి ఒకపక్క న కూర్చున్నాను. ఎవరో వచ్చి మా వీపుపై ఆప్యాయంగా చేయి వేశాడు. నా ముఖం లోని బాధను గమనించాడో... ఏమో... ఏ ఊరు బాబు అని అడిగారు. సిద్దిపేట వద్ద తడకపల్లి అని చెప్పాను. ఆయన నాకన్నా పదేళ్లు పెద్ద నే ఉన్నట్టున్నాడు. ఏం చదువుకుంటున్నావని అడుగగా.. పదవ తరగతి అని చెప్పాను. చదువుకునే వాడివి, ఇలా చెప్పక చేయక వస్తావాఅని మందలించాడు. జరిగిందేదో జరిగింది. ఆ గోడకు ఒరిగి పడుకో. తెల్లవారి నీకు హైదరాబాద్ అంతా చూపిస్తాను అన్నాడు చూపిస్తాను అన్నాడు. అన్నట్లే మరునాడు చార్మినార్, సాలార్ జంగ్ మ్యూజియం, గోల్కొండలు చూసాము. రాత్రి అయ్యే సరికి ఇక ఇంటికి పొమ్మని బస్సు ఎక్కించాడు. ఆనాడు ఆ మిత్రుడి అడ్రస్ తీసుకోలేదు. అడ్రస్ ఉన్నట్లయితే ఉత్తరాలు రాసుకునేవాళ్ళం. ఈ రోజుల్లో ఫోన్లు విరివిగా అయ్యాయి. ఫోన్ నెంబర్ ఉంటే మాట్లాడుకునే వాళ్ళం కదా! అయినా నా ఒక మంచి మిత్రుడిని మిస్ అయ్యానని ఇప్పటికి బాధగా ఉంది.