ఆట వెలదులు : --ఎం. వి. ఉమాదేవి నెల్లూరు
 మరువం 

మరులనొలుకు పత్రి మరువంపుపరిమళ 
భాగ్యమదియు చాల భవ్యమగుచు 
నాసికలను దాఁకి నవ్యభావనలిచ్చు 
వధువు జడను జేరి వలపుపెంచు!

మల్లె దవనములకు మనసైన నెచ్చెలి 
పూల జడకు ముఖ్య వస్తువగుచు 
కుండిలోన ని

లిచి కులుకుచునున్నట్టి 
మరువమెపుడు మనకు మరపు రాదె!

మాలలల్ల కళగ మధ్యలోపూలుంచి 
పచ్చ పచ్చ గాను పరిమళమున 
హెచ్చు పడకనుండు హేలగాకదులుచు 
గాలివీచినపుడె గర్వపడుచు!