మహా శివరాత్రి (బాలగేయం):-మమత ఐల-హైదరాబాద్
నిరాడంబరు శివుడంట
జలధారలు తనకిష్టమట
పులిచర్మాంబరుడితడంట
విభూతి ధరించుతాడంట

త్రిశూలదారి ఇతడంట
బిల్వపత్రము ఇష్టమట
గౌరీహర కళ్యాణమట
మహా శివరాత్రి రోజంట

లింగరూపమున శివుడంట
ఆవిర్భవించెనీ రోజంట
ఆది అంతము లేకుండా
దేవుళ్ళ తగువును తీర్చెనట

పిలిస్తె పలికే దేవుడట
భోళాశంకరుడితడంట
సర్పాలను ధరించునట
గంగనుశిగలో మోసెనట