దోమా ఈగా:-:- డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 దోమా ఈగా వెళ్ళిపోండీ
మా కంటికి కనిపించక వెళ్ళిపోండీ
పోనీలెమ్మని మిమ్మల్ని ఎదగనిస్తే
రోగాలన్నో మాకు ఇస్తున్నారుగా
మాకు ఎన్నో ఇడుములు కలిగిస్తున్నారుగా
మీ జన్మ రహస్యం మాకు తెలుసునులే
ఎక్కడైనా నీళ్ళు నిలువనివ్వములే
ఎక్కడైనా చెత్త నిలువచేయములే
రసాయనాలు పిచికారీ చేస్తాముగా
మీ అంతు మేము బాగా చూస్తాముగా !!

కామెంట్‌లు