చదువు: - కవిత వెంకటేశ్వర్లు
చదువు చదువు
చూపు బతుకు తెరువు
చదువుతోనే కొలువు
తల్లి దండ్రికి కాకు బరువు

ఏ బడి అయితే నేమి
ఏ స్కూల్ అయితే నేమి
పుస్తకాలకు ఉండదు కలిమి లేమి
పుస్తకం అందరికి ప్రేమి

చదువుతోనే పెరుగు జ్ఞానం
చదువుతో దొరుకు మంచి స్థానం
చదువుతోనే గౌరవం
చదువుతోనే సర్వ0

చదువుకుంటేనే మేలు
చదువు తోడుంటేనే చాలు
చదువు0టేనే విదేశాలు
చదువే లక్షలు కోట్లు!!