ఎక్కడిది?:(సాంప్రదాయపు పాట:)- సేకరణ: సత్యవాణి
కంచికి పోతావ కృష్ణమ్మా
ఆ కంచి వార్తలేమి కృష్ణమ్మా

కంచిలో వున్నది అవ్వా
ఆ అవ్వపెట్టునాకు బువ్వా

బువ్వ వున్నది గాని కృష్ణమ్మా
నీకు కూర ఎక్కడిదోయి కృష్ణమ్మా

అవ్వ దొడ్లొవుంది  బీర
ఆ బీరనె చేయును కూర

కూరవున్నదిగాని కృష్ణమ్మా
నీకు పప్పు యెక్కడిదోయి కృష్ణమ్మా

పక్కింటి వారింట్లొ అప్పు
ఆ అప్పు పెట్టును నాకు పప్పూ

పప్పు వున్నది గాని కృష్ణమ్మా
నీకు నెయ్యి యెక్కడిదోయి కృష్ణమ్మా

కోమటి అక్కప్ప చెయ్యీ
ఆ చెయ్యి పోయును నాకు నెయ్యి

నెయ్యీ వున్నదిగాని కృష్ణమ్మా
నీకు పెరుగూ యెక్కడిదోయి కృష్ణమ్మా
 ఆ ఇంటి ఈ ఇంటి పొరుగూ
ఆ యిరుగూ పోయును నాకు పెరుగూ

బువ్వ తిందువు రార కృష్ణమ్మా
నీకు కంచిలో పనియేమి కృష్ణమ్మా

కంచిలో వున్నది అమ్మా
ఆ అమ్మ పేరు కామాక్షమ్మా

మ్రొక్కి వద్దును నేను అమ్మా
బువ్వ పెడుదువు గాని లేమ్మా
నాకు బువ్వ పెడుదువుగాని లేమ్మా

        

కామెంట్‌లు