సర్కార్ బడి(బాల గేయం)--ఎడ్ల లక్ష్మి-సిద్దిపేట
సంటోడా సంటోడా వస్తావా
సర్కార్ బడికి పోదాము
ఒయ్యిలు వాళ్ళు ఇస్తారు
ఓనమాలు రాపిస్తారు

శిక్షణ పొందిన గురువులు
ఏ బి సిడిలను చెప్పెదరు
ఆంగ్ల భాష బోధనతో
చక్కని విద్య నేర్పుతారు

కేజీ నుండి ఆ చదువు
పీజీ వరకు ఉంటుంది
రూపాయి ఖర్చు లేదంట
ఉచిత చదువు మనకంట

కడుపునిండా భోజనమట
ఏక రంగు దుస్తులంట
పరుగులు తీసి పోదాము
సర్కార్ బడి లో చదువుదాము