'సరస్వతీ కంఠాభరణుడు!:---సుజాత.పి.వి.ఎల్.

 తెలుగు సాహిత్యంలో
సంప్రదాయ రీతిలో
వృత్త పద్యాలతో
భావ కవిత్వ దీపాలను వెలిగించిన గౌతమీ కోకిల కవనుడు..
మంటికి, మింటి కన్నింటింకి
మంటగా కవితా కాగడా వెలిగించి..
అంధకారాన్ని ప్రాణ సఖిగా,
నిరాశావాదంను, అధిక్షేప ధోరణిని చాటిన దీపావళి ఖండ కావ్య కర్త..
భావం లేని కవిత్వం
ప్రాణం లేని శరీరం లాంటిదని
పద్యానికి, చంధస్సు అలంకార గుణాల మణులు పొదివిన కవి, రచయిత, కవితాభిమాని, శతావధాని శ్రీ వేదులవారు..!
(మార్చి'22  గౌతమీ కవనుడైన శ్రీ వేదు సత్యనారాయణ శర్మగాఇ జయంతి సందర్భంగా..)