బుల్లెట్ బండి(బాల గేయం)--ఎడ్ల లక్ష్మి-సిద్దిపేట
బుల్లెట్ బండి చూడమ్మా
బుయి బుయి మనీ వస్తుంది
పక్కకు నీవు జరుగమ్మ
నెమ్మదిగా నీవు నడవమ్మ

గుప్ గుప్ పొగలు చిమ్ముతూ
వంద కిలోమీటర్ల వేగంతో
పరుగులు తీస్తూ వస్తుంది
పదిలంగా నీవు నడవమ్మ

పీల్చే గాలి కాలుష్యం
ముక్కుకు బట్ట కట్టమ్మ
ముందుకు అడుగులేయమ్మ
భద్రంగా నీవు నడువమ్మ

బుల్లెట్ వేగం చూసాకా
అదుర్త పడకు చిట్టెమ్మ
ఆగం కాకు చెల్లెమ్మ
ఇంటికి క్షేమంగ చేరమ్మా