తెలుగుబిడ్డ( బాల గేయం )- సత్యవాణి

తేట తెలుగు పలుకు
చిలుక పలుకుల కులుకు
పరభాష ఒక ములుకు
ఓ తెలుగు బిడ్డా

చదువ సులభము సుమ్ము
తలకు ఎక్కును నమ్ము
తెలుగుభాష విధమ్ము
ఓ తెలుగు బిడ్డా

పద్య రచనకు తెలుగు
గద్య రచనకు తెలుగు
జనపదమ్ముల వెలుగు
ఓ తెలుగు బిడ్డా

ఆంగ్లమ్ము ఒక భాష
అది పలుకమని ఘోష
తెలిసికొన ఓ ప్రయాస
ఓ తెలుగు బిడ్డా