పిల్లలు నాటిన మొక్కలు(బాల గేయము)-ఎడ్ల లక్ష్మి-సిద్ధిపేట
వాణి రాణి వచ్చారు
కొత్త సంవత్సరమన్నారు
జామ మొక్కలు తెచ్చారు
పెరటి లోన నాటారు

తోటి పిల్లలకు చెప్పారు
పిల్లలంతా కలిశారు
నర్సరి కేమో వెళ్లారు
మొక్కలు కొన్ని తెచ్చారు

వీధి వాడా తిరిగారు
పాదులు తవ్వి పెట్టారు
తెచ్చిన మొక్కలు నాటారు
చెట్లకు కంచెలు చుట్టారు

అమ్మానాన్నల పిలిచారు
నాటిన మొక్కలు చూపారు
కొత్త వత్సర కానుకలన్నారు
పల్లెను పచ్చగా చేశారు.