పల్లె పాటలు (బాల గేయం)--ఎడ్ల లక్ష్మి-సిద్దిపేట
సాంబయ్య తాత వచ్చాడు
తాంబూర్ర చేత పట్టాడు
రాముని కథ చెప్పాడు
రామాయణమంతా విప్పాడు

రమణయ్య తాత వచ్చాడు
హార్మోనియం తెచ్చాడు
కృష్ణ లీలలు విప్పాడు
భారతమంతా చెప్పాడు

హరిదాసు వచ్చాడు
చిరతలు చేతబట్టాడు
హరినామం పలికాడు
భక్తుల మన్నన పొందాడు

వీరనారులు వచ్చారు
బుర్రలు చేత బూనారు
బుర్రకథ నేమో చెప్పారు
దేశ చరిత్ర చాటారు


కామెంట్‌లు