నిజాయితి:- .డా.బెల్లంకొండనాగేశ్వరరావు.

 అమరావతి నగరంలోని వ్యాపారి రాఘవయ్యకు తనవ్యాపార విషయాలు చూసుకునేందుకు నమ్మకమై ఉద్యోగి అవసరంఅయ్యాడు. ఆ ఉద్యోగకొరకు వచ్చినవారందరిని పరిక్షింపగా,చివరికి ఇద్దరురాముడు,సోముడు అనే యువకులు మిగిలారు.ఆ ఇద్దరు యువకులకు మట్టినింపిన పాత్రలు చెరి ఒకటి ఇచ్చి'నాయనలారా ఇవిగొ చిక్కుడు గింజలు వీటిని చెరొకటి తీసుకొండి, ఈమట్టిపాత్రలో నాటి ప్రతిదినం నీరు పోస్తూ గమనించండి. నేడు పౌర్ణమి వచ్చే పౌర్ణమినాటికి మొలక్కెత్తిన మోక్క తీసుకునిరండి' అన్నాడు రాఘవయ్య.
మరలా పౌర్ణమినాటికి ఇరువురి యువకులు రాఘవయ్యగారిని చూడటానికి వచ్చారు.రాముడు తెచ్చిన పాత్రలొ చిక్కుడు గింజ మెలకెత్తలేదు.సోముడు తెచ్చిన పాత్రలొచిక్కుడుగింజ మొలకెత్తి ఉంది.'రాముడు నీకు ఇచ్చిన మట్టి పాత్రలొని చిక్కుడు గింజ సరిగ్గా గమనించలేక పోయావు అందుకే అది మొలకెత్తలేదు'అన్నాడు రాఘవయ్యగారు.'అయ్యా నేను ప్రతిదినం నీరు పోస్తూనేఉన్నా,పైగా గాలి,వెలుతురు తగిలేలా ఉంచి బాగా గమనించాను.నా తప్పు ఏమిలేదు,బహుసా మీరు నాకు ఇచ్చిన చిక్కుడుగింజలో ఏదైనా లోపంఉండవచ్చు'అన్నాడు రామం.పక్కున నవ్విన రాఘవయ్యగారు 'నాయన లారా మీ ఇద్దరికి ఇచ్చిన చిక్కుడు గింజలను కావాలని, వేయించి(వేడిచేసి) నవి,మీకు ఇచ్చాను,అవిమెలకెత్తవు.ఆవిషయంనీవు కొంత గ్రహించగలిగావు.సోముడు చిక్కుడు గింజ మొలకెత్తుతుందేమో అని, కొద్దిరోజులు చూసి వేరే చిక్కుడు గింజ నాటి మెలకెత్తించాడు. నువ్వుమాత్రంనిజాయితీగా ఎటువంటి మార్పులు చేయకుండా పాత్రను తీసుకువచ్చావు.నీ నిజాయితీమెచ్చదగినిది.సోమయ్య నిజంచెప్పు నువ్వు చిక్కుడు గింజ మార్చావుకదూ'అన్నాడు రాఘవయ్య.
అవును అన్నట్లు తలఊపుతూ తనతప్పు అంగీకరించి వెళ్లిపోయాడు  సోమయ్య.
'రామయ్య నీ నిజాయితి మెచ్చదగినది ,నీలాంటియువకులే దేశానికి వెన్నుముక. నేడే ఉద్యోగంలొ చేరు,ఇవిగో తాళాలు నేటినుండి నావ్యాపార లావాదేవీలు అన్ని నీవే నిర్వహించాలి'అన్నాడు రాఘవయ్య.వినయంగా చేతులుజోడించాడు రాముడు.