చిలుక -దొండపండు(కథానిక )--ఎం. వి. ఉమాదేవి నెల్లూరు

 ఒక తోటలో చిలకకి ఆకలి వేస్తుంది.ఎక్కడ కూడా చెట్టుకి ఒక పండు కాయ లేవని దుఃఖంతో ఉంది.ఎక్కువ సేపు ఆకలి కి తట్టుకోలేను కదా.. అనుకున్న చిలకమ్మ  అలా ఇళ్ల వైపు వెళ్లి ఒకటి రెండు చోట్ల పెరడు, గేటు, ప్రహరీ గోడ దగ్గర 
తచ్చాడినా పండ్ల వాసన ఏమి లేదు. ఒక చోట జామ చెట్టు ఉంది కానీ పిందెలు. ఒక ఇంట్లో బొప్పాయి పచ్చి కాయలే చెట్టు 
నిండా.. !
    ఇప్పుడు ఎలా అనుకున్న చిలక ఒక వరండాలో పిల్లలు ఏదో తింటున్నట్లు గమనించి 
కొద్దిగా దగ్గరికి వెళ్ళింది.ఆ పిల్లలు చిలక , చిలక వచ్చింది అంటూ చేతిలో పప్పులు విసిరారు.. చిలక ఆ బఠాణిలూ 
వేరు సెనగ పప్పులు కొద్దిగా రుచి చూసి మళ్ళీ వేరే చోటుకి 
ఎగిరి పోయింది. ఆకలి తీరలేదు..ఒక పెరటిలో ఇల్లాలు చిన్న బుట్టతీసుకొని చిన్న పందిరి దగ్గరికి వెళ్లి ఏదో కోస్తూ ఉంటే ఆశ  ఆసక్తి తో వెళ్లి పారి 
జాతం చెట్టు మీద వాలి చూసిన చిలక, ఆమె దొండకాయ లు కోసుకొని వెళ్ళాక ఆ పందిరి ఎక్కి వెతికినది. ఈ మధ్య సరిగా కోయలేదు అనుకుంట వెళ్లిన ఆమె మాటలు నిజమే.. కొన్ని దొండకాయ లు బాగా పండి తీయని వాసన.. !చిలక సంతోషం తో కొన్ని పండ్లు తిన్నది. మృదువుగా తీయగా ఉన్నాయి. ఇల్లాలికి ఆశీస్సులు ఇస్తూ.. ఇల్లు గుర్తు పెట్టుకోని వెళ్ళింది చిలకమ్మ.. !
దూరం నుండి ఒక పిల్లవాడు దానిని ఫోటో తీసి బడిలో జవహర్ లాల్ పుట్టినరోజున 
బడిలో పోటీలకు చూపించి 
ప్రధమ బహుమానం పొందాడు.!

కామెంట్‌లు