గాజులబ్బాయి:- సత్యవాణి కుంటముక్కుల

 గాజులండి గాజులు
గలగలమను గాజులు
రంగు రంగుల గాజులు
రండి రండి కొనండి
రత్నాలగాజులు
చిన్ని పొన్ని పాపలకు
దిష్టిని తొలగించును
అమ్మలకుా అక్కలకు
అవ్వలకు అత్తలకు
అందమిచ్చు గాజులు
ఆనందమిచ్చు గాజులు
వధువుల చేతికి తొడగగ
వలపు పెంచు గాజులు
సూలింతకు బాలింతకు
శుభములిచ్చు గాజులు
గలగలమని సడిని చేయు
గమత్తైన గాజులు
గాజులండి గాజులు
గమత్తైన గాజులు