బావా బావా గేయం:--ఎడ్ల లక్ష్మి-సిద్దిపేట
బావా బావా పన్నీరు
రావా రావా చెన్నూరు

గుర్రాలు బండి ఎక్కిస్తా
గురిగి లో నిల్లు తాపిస్తా
ఊరు వాడ తిప్పేస్తా
బారు బీర్ లేదు బావా //బావా //

ముంతెడు గంజి ముంచిస్తా
ముద్దుగ నీవు తాగు బావా
గుగ్గిల్లు నేను తెప్పిస్తా
గుర్రాని కేమో తిని పిస్తా //బావా //

బల్లెం చేత పట్టు బావా
గుర్రం మీదా ఎక్కు బావా
రణం నీవు చేయు బావా
రణం లో గెలిచి రా బావా //బావా //

గుర్రం. నీవు దిగి నాకా
బుక్కలొ చెక్కరి పోస్తబావా
చేక్కరి భుక్కి మా బావా
అక్కను నీవు చూడు బావా //బావా//


కామెంట్‌లు