మాటలతో అంకెలు,(బాల గేయం.)-ఎడ్ల లక్ష్మి-సిద్దిపేట
ఒకటి ఒకటి ఒకటి
భాషలెన్నైయిన భావమొకటే
రెండు రెండు రెండు
చీకటి వెలుగులు రెండు
మూడు మూడు మూడు
కాలాలు మూడు
నాలుగు నాలుగు నాలుగు
వేదాలు నాలుగు
ఐదు ఐదు ఐదు
పంచభూతాలు ఐదు
ఆరు ఆరు ఆరు
ఋతువులు ఆరు
ఏడు ఏడు ఏడు
వారానికి రోజులు ఏడు
ఎనిమిది ఎనిమిది ఎనిమిది
దిక్కులు ఎనిమిది
తొమ్మిది తొమ్మిది తొమ్మిది
గ్రహా లేమో తొమ్మిది
పది పది పది
అవతారాలు పది