చిన్నారి టీటీ తెలివి: - టి. లలితా ప్రసాద్

 మాంసం తినని జంతువున్నింటికీ అది చాలా చెడ్డరోజు. వాటి స్నేహితుల్ని చాలామటుకు సింహం వేటాడి  చంపడంతో వాటికి భయం పట్టుకుంది. సింహం, దానిలాంటి వేటాడే జంతువునుంచి  తప్పించుకోవడం ఎలా అన్నది ఆలోచిస్తున్నాయి. కానీ వాటి సమస్యకి పరిష్కారం మాత్రం దొరకడం లేదు.
 వాటి సమస్య గురించి చిన్నారి టీటీ పక్షి విన్నది. ‘‘నేను మీ భయాన్ని పోగొట్టేదా?’’ అని అడిగింది.
 ‘‘చిన్నదానివి నువ్వెలా? పొడుగాటి, బమయిన జంతువుం మావల్లే కావడం లేదు. సింహాన్ని వదిలించుకోవడం అంత సుభం కాదు. అసు మాలో ఎవరికంటే బమయినదానివి?’’ అడిగింది ఎద్దు చాలా చిరాగ్గా.
 ‘‘నేను ప్రయత్నించడంలో మీకేమీ ఇబ్బంది లేదుగా?’’
 ‘‘నీలాంటివారివ్లనే ఉన్నది రెండిరతు పెరుగుతుంది. అంతకుమించి మాకు నువ్వేమి చేయగవు?’’ జిరాఫీ అడిగింది.
 ‘‘సరే. చివరిసారిగా అడుగుతున్నాను, నన్ను సహాయపడనీయండి. మీరు ఏదో ఒక మార్గం ఆలోచించే లోగా నేను నా పద్దతిలో సింహానికి బుద్ధిచెప్పమంటారా?’’ టీటీ అడిగింది.
 ‘‘సరే. నీ యిష్టం వచ్చినట్టు చేయి. కానీ అసలే బాణం దెబ్బతో వివిలాడుతున్న గాయాన్ని మరింత రేపకుండా ఉంటే చాు’’ అన్నది ఏనుగు. జంతువు అనుమతి తీసుకుని టీటీ బయుదేరింది.
 నిజానికి టీటీ  ప్రతిపాదనను ఎవరు కాదనలేదు. అందుకు సంతోషంతో రెక్కు వేగంగా ఆడిస్తూ ఆకాశంలోకి ఎగిరింది. జంతువుకు ఏమి చేయాలో తోచడం లేదు. అలా ఆకాశంలో తిరుగుతుండగా నే మీద ఏనుగు కనిపించి రివ్వున కిందకి వచ్చి చెట్టుకొమ్మన వాలింది.  సమీపంలోకి వచ్చిన సింహంతో ఇలా అన్నది, ‘‘రాజా, నీకు దండాు. నువ్వు అన్నింటి పనీ పట్టగవు కానీ ఆకాశంలో ఎగిరే మాబోటి పక్షును  మాత్రం ఏమీ చేయలేవు. అదే నీలో లోటు.’’
 అది విన్న సింహానికి నిజంగానే కోపం వచ్చింది. స్వేచ్ఛగా అన్ని జంతువును  ఇట్టే తాను చంపేస్తోంది. కానీ ఎన్నడూ పక్షును పట్టాన్న ఆలోచనే రాలేదు. ఎందుకు? ఇవాళ ఈ చిన్నది అదో పెద్దలోపంలో ఎత్తిచూపుతోంది అనుకుంది. ఇవాళ ఆ ప్రయత్నమూ చేయానుకుంది. వేరేదే ఎందుకు టీటీతోనే  మొదలెడదామనుకుంది. 
 ‘‘ఉదాహరణకు నిన్ను పట్టి తినేస్తే?’’ సింహం అడిగింది.
 ‘‘నీ కడుపులోకి వెళ్లి అక్కడినుంచీ మాట్లాడతా,  గర్విష్టి!’’ అని టీటీ పాట అందుకుంది.
 ‘పెద్ద పెద్ద జంతువునే నమిలి మింగేస్తున్నాను, ఏదీ మాట్లాడటం లేదే! నువ్వెలా?’’ అడిగింది సింహం.
 కానీ టీటీ పాడటం ఆపలేదు. పైగా సింహం త చుట్టూ తిరుగుతూ పాడుతోంది.సింహం సహించలేకపోయింది. ఒక్కసారిగా చేయి ఎత్తి పంజాతో ఠక్కున దాన్ని పట్టి అన్నది, ‘‘నిన్ను పట్టేశాను. నిన్ను ముక్కు ముక్కుగా నమిలి తినేస్తాను, అపుడు ఎలా మాట్లాడగవో చూస్తాను’.
 సింహా ఆ మాట అని నోటిని పెద్దది చేసి టీటీని నోట్లో వేసుకుంది. టీటీ వెంటనే ముక్కుతో దాని నాుకని గట్టిగా కొరికింది. దీంతో సింహం ఒక్కసారిగా మింగేసింది. అంతే టీటీ కాస్తా దాని కడుపులోకి వెళ్లింది. టీటీ పని అయిపోయింది. అది ఇంకేమీ చేయలేదని సింహం భావించింది. ఆ ఆనందంతో ఇలా పాడిరది..
 ‘‘నేను పక్షిని పట్టాను బహు సుభంగా
 నేను నమనే లేదు
 కానీ గుటుక్కున కడుపున చేరింది 
 చిన్నది, బుజ్జిది  
 అన్నింటినీ తినగను నేను!’’
అలా పాడుతూ, ఎగురుతూ అడవి అంతా తిరిగింది సింహం. అలా దున్నపోతు ఉన్న చోటికి వచ్చింది. టీటీ సింహం కడుపులోంచి వాటిని హెచ్చరించింది: ‘‘పారిపోండి మీరంతా! లేకుంటే మీలో ఒకరిని తినేస్తుంది.’’ అని.
 టీటీ హెచ్చరిక విన్న దున్నపోతు పారిపోయాయి. టీటీ మాటను సింహం కూడా విన్నది. కానీ దాని చుట్టుపక్క ఎక్కడా అది కనపడలేదు. సింహం మాత్రం తన ఆనందంలో పాడుకుంటోంది..
 ‘‘నేను పక్షిని పట్టాను బహు సుభంగా
 నేను నమనే లేదు
 కానీ గుటుక్కున కడుపున చేరింది 
 చిన్నది, బుజ్జిది  
 అన్నింటినీ తినగను నేను!’’
 సింహం అలా తిరిగి తిరిగి దుప్పి మందను చేరింది. వాటిని కూడా టీటీ హెచ్చరించింది పారిపోండని. అవన్నీ పారిపోయాయి. టీటీ మాట సింహమూ విన్నది కాని పట్టుకుని చంపడానికి అది చుట్టుపక్క ఎక్కడా కనపడలేదు.
 ఇలా టీటీ అనేక జంతువును సింహం ఆకలికి బలికాకుండా తప్పించింది. సింహం అలా రోజు తరబడి తిండి దొరక్క తిరుగుతోంది. క్రమేపీ బహీనమయి  శక్తినీ కోల్పోయి చనిపోయింది. అది  చనిపోయేముందు టీటీ  దాని కడుపుతోంచి, నోటిలోంచి బయ టికి వచ్చి చెట్టుమీదకి  ఎగిరిపోయింది. సింహానికి  పట్టిన  గతిని కథు కథుగా అన్ని జంతువుూ చెప్పుకున్నాయి. 
 ఆ వార్త విని అన్ని జంతువుూ ఎంతో సంతోషించాయి. అన్ని  ప్రత్యేకంగా సమావేశమయ్యాయి. నాుగు కాళ్ల జంతువున్నీ టీటీని సత్కరించాని నిర్ణయించాయి. దానిపట్ల వాటి గౌరవాన్ని ప్రదర్శించేందుకు అన్నీ ఎప్పుడూ వాటి వీపు మీద ఊరేగే అవకాశం ఇచ్చాయి.
 ( ఇది జాంబియా జానపద కథ.  వాస్తవంగా చెప్పబడిన భాష  ఇల )