నిరుపేద కవీ:-- యామిజాల జగదీశ్
పేరుప్రఖ్యాతులున్న కవీ
నలుదిశలా నలుగురికీ 
తెలిసిన కవీ
ప్రభుత్వానికో లేఖ
రాసాడు....

అద్దె డబ్బులు కట్టుకోలేక
తరచూ
మారవలసిన నిర్బంధాలతో
ఇప్పుడుంటున్న 
ఇరవై తొమ్మిదో ఇంటి నుంచి
రాస్తున్న లేఖ ఇది....

రేపో 
ఎల్లుండో
మందులకూ 
డబ్బుల్లేని స్థితిలో
తీవ్ర అనారోగ్యంతో
రాస్తూ రాస్తూ
కవితాక్షరాలపై వాలి
అస్తమించబోయే ఈ కవి కోసం
స్మారకమందిరాలను
ఎన్నని కొనగలరు