మా ఊరు కథలు: రామాయంపేట:-- దోర్బల బాలశేఖర శర్మ

 మల్లె చెరువు కట్ట!
నమ్మశక్యం కాని విషయం. ఇది ఒకప్పటి మా ఊరు  రామాయంపేట మల్లె చెరువు కట్ట. అప్పటి మా తరాల వారు ఆశ్చర్య పోతారు. ఒకప్పటి కట్టకు, ఈ మినీ ట్యాంక్ బండ్ కూ ఎంత తేడా! నా  చిన్నప్పటి మల్లె చెరువును ఇప్పటి ఈ జలాశయంతో అసలు పోల్చగలమా అనిపిస్తుంది. ప్రభుత్వాలు అనుకుంటే కానిదంటూ ఏముంటుంది? అభివృద్ధి అంటే ఇదే కదా! ఇప్పుడు 'ఊరు బట్టలు' ఉతుక్కోవడం కోసం చెరువులను వాడుకోవలసిన పనిలేదు. వాటిని అద్భుతమైన సరోవరాలుగా మార్చుకోవచ్చు.