అమ్మ మాట (బాలగేయం)-సత్యవాణి
అమ్మ మాట వినుము బాల
అది నీకు మేలు చేయు

నాన్న మాట నమ్ము బాల
ఆపదలు ఇంతైన రావు

గురువుమాట వినుము బాల'
సుజ్ఞానమెంతొ అబ్బునీకు

అక్కమాట వినుము బాల
అమ్మవలెనె హితవుచెప్పు

అన్నమాట వినుముబాల
నాన్నవలెనె నడవడిక నెేర్పు హితునిమాట వినగ నీవు
చెడుదారుల చేరనీదు
సుద్దులెపుడు వినుముబాల
బ్రతుకు సరిదిద్దుకొనగ వీలు
నల్లేరుపై బండివలెను
నడచిపోవు నీదు బ్రతుకు