మనసా స్మరామీ(వచనకవిత):-డా.రామక కృష్ణమూర్తి--బోయినపల్లి,సికింద్రాబాద్

 ఎన్నో ఆశలు యెదలో సవ్వడి చేస్తున్నాయి.
కలలో కన్పిస్తున్న కాంతులు
కొత్తలోకాలను చూపిస్తున్నాయి.
ఆశయాల ఆలోచనలు అంతరంగంలో నివాసమేర్పరుచుకున్నాయి.
ఎన్నో ఊసులు మనసులో మాటువేసుకొని కూర్చున్నాయి.
రాశుల్లా పోగుబోసుకొని‌ మాటల మూటలు నిక్షిప్తమయ్యాయి.
పథకాలు,ప్రణాళికలు,లక్ష్యాల
సాధనా సామర్థ్యాలన్నీ నిలువరమైనాయి.
జ్ఞానసంపదలన్నీ మది భాండాగారంలో నిండిపోయాయి.
ఊటలుగా ఊహలన్నీ అక్షయంగా ఊరుతుంటే
మనసులోని మాటను చెప్పుకోవాలని నా అన్వేషణ.
ఆ సమయం వస్తుందా?
ఆ మనిషి ఎదురుపడతాడా?
గూడుకట్టుకున్న‌ విషయాలన్నీ చెప్పాలని తపన.
పంచుకోవాలని,పట్టించుకోవాలని ఆరాటం.
మదిలోని‌ మాటలన్నీ నీకే సమర్పించాలని నా కోరిక.

కామెంట్‌లు