క్షమించగలరు:- సత్యవాణి

 బెంగగావుంది
మీభవితను తలచుకొంటే
మరెంతో బాధగావుంది
అంతా మాతరమే 
అనుభవించేస్తున్నాము
మీ తరానికిక
మరేమీ మిగలదేమోనని
మిగల్చలేమేమోనని
మీ భవితను తలచుకొంటే
బాధగానూవుంది
ధనాన్ని సృష్టించి
గుట్టలుగా గుట్టలుగపోగెట్టి
 ఇవ్వగలము
కానీ
నీరునెలా సృష్టించి ఇవ్వగలము
కొండలనూ గుట్టలనూ
భూగర్భ నిధులనూఎలా సృష్టించి
 ఇవ్వగలము
మీ భవితను తలచుకొంటే
బాధగానూ వుంది
భూమిని ధ్వంసం చేశాము
భూగర్భ నిధులనూ విధ్వసంచేశాము
నీటిని కాలుష్యం చేశాము
మీకంటూ గుక్కెడునీరు
మిగలకుండా చేశాము
బెంగగా వుంది
మీభవితను తలచుకొంటే
అణువులతో చెలిమి చేశాము
అనంత విశ్వనాశనానికి
బీజంవేశాము
కొండలను పిండి పిండి చేశాము
గుట్టలను జల్లెడ పట్టేసేము
అడవులను అంటకాల్చేశాము
అటవీ సంపద ఆనమాలు లేకుండా
చేశాము
పులుగులకూ మృగములకూ 
మనుగడ లేకుండా చేశాము
ఇప్పటివరకూ
నేలను దోచుకోవడమైయ్యింది
ఇక ఇప్పుడు నింగిపైనా కన్నేశాము
బెంగగావువుంది
మీభవితను తలచుకొంటే
ఆదునికత అంటూ
ఆచారాలను మంటగలిపాము
చాదస్తం అంటూ
సంస్కృతిని నాశనం చేశాము
కట్టూ బొట్టూ బట్టా భాషా మాటా యాసా
అంతా మార్చేశాము
భారతీయతకు ఆనవాలు
లేకుండా చేసేశాము
మన్నించు  మమ్మల్ని
ఆకారంలో
నిన్ను మనిషిగా మిగిల్చినందుకైనా
మమ్మల్ని క్షమించు