అదిచాలు నాకు :--కిలపర్తి దాలినాయుడు

 
నువ్వు మట్టినే కాల్చేసినా
సిమ్మెంటు తో తొక్కేసినా
నేలవాసన చాలు
నాయెదుగుదలకు!
నింగి చినుకులు చాలు
నా పెరుగుదలకు!
అడుగు నేలుంటేను
ఆక్రమిస్తావు!
అందులో భవనాన్ని
మొలిపించు తావు!
అంగుళం నేలైన
అదిచాలు నాకు
పచ్చ నౌ పందిరిని
వేస్తాను నీకు!
పండ్లు మెండుగ కాచి
కుడుపుతా నీకు!
పిట్ట పాపల గూడి
కాపలా నీకు!
చెట్టు కొట్టక దాన్ని
కాపాడు మానవా!
చెట్టుదొరకని పిట్ట
వౌదువోయ్ మానవా!?