రంగుల రసకేళి..హోలీ.:-- లీలా కృష్ణ-తెనాలి
కావలి కాసే కనులకు , మిన్నును త్రాకే మనసుకు..
కేరింతలు చూపిస్తే.. అది హోలీ.

గోపయ్య పిలుపు విని , రాధమ్మ నడక కని..
ఎగిసెగిసి పడితే ...అది ఎర్రాని గోధూళి.

కొత్త కొత్త రంగులను, చింత తీర్చు మార్గమును..
చూపగోరు ...కదలాడే రంగుల కథనమే కవి పాళీ.

రంగు, రూపం ఎరుగక, గొప్ప , బీద అని చూడక..
అడుగడుగున వింతలు చూపిస్తే.. అది వైకుంఠపాళీ..