నమస్కారములు:-- డా.గౌరవరాజు సతీష్ కుమార్.


 బంతిపూలకు సమస్కారములు

బాగుగ విరిసీ పూసినందుకు

పంటచేలకు నమస్కారములు

మా ఇంటి గాదెలు నింపినందుకు

పాడి ఆవులకు నమస్కారములు

పాలను బాగా ఇచ్చినందుకు

గంగిరెద్దులకు నమస్కారములు

గంతులతో నాట్యం చేసినందుకు

హరిదాసులకు నమస్కారములు

హరికీర్తనములు నుడివినందుకు

ఉదయభానునికి నమస్కారములు

జగతిన వెలుగులు నింపినందుకు

చందమామకు నమస్కారములు

ఇలలో వెన్నెల పరిచినందుకు

అమ్మనాన్నలకు నమస్కారములు

మమ్మల్ని కని పెంచినందుకు

అక్కఅన్నలకు నమస్కారములు

నాతో ఆడి పాడినందుకు

నా నేస్తాలకు నమస్కారములు

నాతో స్నేహం చేసినందుకు

గురువుగారికీ నమస్కారములు

నాలో జ్ఞానం నింపినందుకు !!