గీసిస్తా:-:- డా.గౌరవరాజు సతీష్ కుమార్.


 కోయిలతో గొంతును కలిపీ

తేనెటీగతో జత కలిపీ

చిలుకతోనీ మాటను కలిపీ

నీలిమబ్బుపై ఊయలలూగీ

వానచినుకులో చక్కగ తడిసీ

పక్షులతోనీ కలిసి ఎగిరీ

నింగిలొ చుక్కలు లెక్కిస్తా

నిండుపున్నమి జాబిలి నుండీ

పండు వెన్నెలలు నిండుగ తీసీ

ఇంటి గోడలకు వెల్లగ వేస్తా

ఇంద్రధనువులో రంగులు తీసీ

రాతిరి కలలో చూసిన రాణికి

రంగుల బొమ్మలు గీసిస్తా !!