ఉగాది బాలల కవితల పోటీ కొరకు,బాలలు రాసిన కవితలకు ఆహ్వానం


 ఉగాది పర్వదిన సందర్భంగా బాలల్లో సాహిత్య అభిరుచి పెంపొందించి, తద్వారా వారిలో దాగివున్న సృజనాత్మకతను వెలికితీయాలనే  ఉదేశ్యం   తో  ఉభయ తెలుగు రాష్ట్రాల పాఠశాలల్లో చదువుచున్న విద్యార్థులనుండి కవితలను ఆహ్వానిస్తున్నామని అక్షర సేద్యం ఫౌండేషన్ కన్వీనర్ వేల్పుల రాజు ఒక ప్రకటనలో తెలిపారు.ప్రథమ బహుమతి 516 రూపాయలు,ద్వితీయ బహుమతులు(2) 316 రూపాయలు, తృతీయ బహుమతులు (3)216 రూపాయలు చొప్పున మరియు 116 రూపాయలు చొప్పున 10 ప్రత్యేక బహుమతులను చెవిటి ఆనంద్ శ్రీనివాస్ సిద్దిపేట గారు అందిస్తున్నారు.హామీ పత్రంతో పాటు  విద్యార్థులు తాము వ్రాసిన కవితలను "కన్వీనర్, ఉగాది కవితల పోటీ, అక్షర సేద్యం ఫౌండేషన్ గ్రా,, రామునిపట్ల, సిద్దిపేట జిల్లా -502267 చిరునామా కు  2021 ఎప్రిల్ 2వ తేదీలోగా  స్వయంగా, లేదా వాట్సప్ ద్వారా (9701933704) పంపగలరు.పూర్తి వివరాలకు 9701933704 సెల్ నంబర్ లో సంప్రదించవచ్చు నని తెలిపారు.