అమ్మ ప్రేమ: --ఎడ్ల లక్ష్మి-సిద్ధిపేట
అమ్మే మన ప్రాణం
అమ్మే మన దైవం

తన రక్తమాంసాలు పంచుతూ
అమ్మ కడుపులోన పెంచుతూ
నవమాసాలు మోస్తూ అమ్మ
తీపి కలలెన్నో కనునురా //అమ్మే/

కడుపులో నీవు తంతూవుంటే
కల్లు మూసుకుని మురుస్తూ
నీకు జన్మనిచ్చి అమ్మా
పునర్ జన్మ నెత్తునురా //అమ్మే//

చనుబాలు తాపుతూ
కళ్ళల్లో ఒత్తులేసుకుని
తన కంటి చూపువని
దయతో తల్లి పెంచునురా //అమ్మే//

ఎదమీద నీవాడుతుంటే
మదినిండ ప్రేమ పంచురా
తప్పటడుగులు వేస్తుంటే
చప్పట్లు కొట్టి పిలుచునురా //అమ్మే//

అమ్మ మనసు అమృతం
గోరుముద్దలు పెట్టి అమ్మ
చిట్టి బొజ్జ నింపు కుంటు నీ
నూరేళ్ళ బ్రతుకు కోరుతుంది //అమ్మే//