కడుపు ఉబ్బరం, ఛాతీలో మంట -నివారణ...: పి . కమలాకర్ రావు

  మనం తీసుకున్న ఆహారం  సరిగ్గా అరగనప్పుడు  కడుపు ఉబ్బరంగా ఉండటం జరుగుతుంది. కొంత సమయం తర్వాత  దానంతట అదే  సర్దుకుంటుంది.  కడుపుబ్బరం తగ్గకపోతే  కొంతసేపటి తర్వాత చాతిలో మంట కూడా రావచ్చు. పులి త్రేనుపులు కూడా రావచ్చు.
 కడుపుబ్బరం తగ్గడానికి కొన్ని కరివేపాకులను శుభ్రంగా కడిగి ఒక గిన్నెలో వేసి నీరు పోసి కొద్దిగా సొంటి పొడి మిరియాల పొడి కలిపి మరిగించాలి. కషాయం చల్లారిన తర్వాత అందులో కొద్దిగా నిమ్మరసం పిండుకుని  తాగితే  కడుపుబ్బరం తగ్గిపోతుంది.
 కొన్ని దేశి గులాబి పూల రిక్కలను  త్రుంచి ఉప్పు నీటిలో కడిగి. మజ్జిగలో వేసి  మిక్సీ పట్టాలి. ఆ మజ్జిగ త్రాగితే  కడుపులో మంట తగ్గిపోతుంది.
, కొన్ని లవంగాల పొడిని చల్లని నీటిలో కలిపి అందులో కొద్దిగా కలకండ పొడిని కలిపి లేదా మిశ్రీ పొడిని కలిపి తాగితే  చాతిలో మంట  తగ్గిపోతుంది.
 పుదీనా ఆకులను దంచి రసం తీసి  అందులో కొద్దిగా నిమ్మరసం కలిపి  త్రాగితే కడుపులోని గ్యాసు బయటకు వస్తుంది. ఈ సమస్య  పూర్తిగా తగ్గడానికి పుదీనా చట్నీ తయారు చేసుకొని తినాలి.
 కొన్ని తమలపాకులను  బాగా కడిగి  ముక్కలుగా తుంచి  ఒక గిన్నెలో వేసి  కొద్దిగా అల్లం ముక్కలు  మరియు బెల్లం కలిపి బాగా మరిగించి  చల్లారిన తర్వాత  త్రాగితే కడుపు ఉబ్బరం సమస్య పూర్తిగా తగ్గిపోతుంది.
 ధనియాలను, జిలకర ను, కొద్దిగా వామును  విడివిడిగా వేయించి  పొడిగా చేసుకుని అన్నీ కలిపి  నిల్వచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని  గోరు వెచ్చని నీటిలో కలిపి  త్రాగితే  అజీర్తి, కడుపుబ్బరం , గ్యాస్ సమస్య పూర్తిగా తగ్గిపోతుంది.