'దెబ్బ మీద దెబ్బ'..:- ఎన్నవెళ్లి రాజమౌళి కథల తాతయ్య

 నేను మూడో తరగతి లో ఉన్నాను అనుకుంటా..... మిత్రులతో కలిసి చెట్లు ఎక్కుడు.... దూకుడు దొంగా-పోలీస్ ఆట ఆడుతున్నాము. వెనక నుండి పట్టుకోవడానికి పోలీస్ వస్తుండు. తొందర తొందరగా పై నుండి కింది మండ పైకి దూకాను.  మండ నుండి జారి కింద పడ్డాను. చేయి విరిగింది. రక్తము ధారగా కారుతుంది. రక్తం కారే చేతితోనే ఇంటికి వెళ్లాను.  ఆరోజు ఏకాదశి కావడంతో.... చేగోడీలు, అప్పాలు మా నాన్న పొయ్యిమీద వేస్తుంటే... మా అమ్మ చేగోడీలు అప్పాలు. చేస్తుంది. నన్ను చూసి మా అమ్మ చేతికి గుడ్డ కట్టి ఒకటే ఏడుపు-మా నాన్నగారు ఏమో దెబ్బతో ఏడుస్తున్న నన్ను ఇంకో రెండు దెబ్బలు వేసాడు.  దెబ్బ తాకి వాడుంటే.... మళ్లీ కొడతారా అంటూ నన్ను దగ్గరకు తీసుకుంది. మళ్లీ నాన్న కూడా నన్ను దగ్గర తీసుకొని ఆస్పత్రికి తీసుకువెళ్లి కట్లు  కట్టించాడు. 40 రోజులకు నా కట్టు తీసివేశారు. ఈ నలభై రోజులు రొట్టె నే తిన పెట్టారు. గాయమైతే మానింది కానీ, బర్ర ఇప్పటికీ ఉందీ!
కామెంట్‌లు