ఇద్దరు పాపలు(బాల గేయం)--ఎడ్ల లక్ష్మి-సిద్దిపేట
చిన్న పాపా రావమ్మా
పొన్న పూలు పోశాయి
పువ్వులు నీవు తెంపమ్మా
చిన్న మాలలు అల్లమ్మా

పెద్ద పాపా రావమ్మా
ముద్దబంతులు పోశాయి
బంతి పూలు తెంపమ్మా
పూలబంతి చుట్టమ్మా

పాపలు ఇద్దరు రారండి
మాల చేత పట్టండి
గుడికి మీరు వెళ్ళండి
దేవుని మెడలో వేయండి

ఇల్లు దారి పట్టండి 
బంతి మీరు ఆడండి
బాబు చెంతకు చేరండి
గ్లోబు తీసి చూపండి