మహిళ అంటే మార్పు
మహిళ అంటే ఓర్పు
మహిళ అంటే నేర్పు
మహిళ అంటే తూర్పు
సంసార హిత జీవి
సంతోషాల భావి
ఆనందాల భార్గవి
ప్రమోదాల ప్రశాంతివి
చెట్టు నీడలా ఉంటావు ఇంటికి
చల్లని గాలిలా వీస్తావు అందరికి
దప్పిక తీర్చే నీరైతావు గొంతులకి
వర్షము నుంచి కాపాడే గొడుగౌతావు ఆప్తులకి
ఇంటి కోసమే కళ్ళు
ఇంటిల్లిపాదికే ఒళ్ళు
ఇంటి పనులకే హాస్తాలు
వారి బాగోగులకే కాళ్ళు
నిదురలోను కలవరింతలు
పసి పిల్లల యోగక్షేమాలు
రేపటి గురించి చింతలు
ఎవరికైనా ఏమైనయితే
ఒకటే ఉరుకులు పరుగులు
హైరానా పడే సందర్భాలు
కోకొల్లలు
స్త్రీ అంటేనే సహనమూర్తి
కోపమొస్తే దహనమూర్తి
ప్రేమను పంచే ప్రేమమూర్తి
ద్వేషాన్ని తుంచి దేవతామూర్తి!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి