బడిబడికి తోపుడుబండి: సాదిక్ అలీ

 పల్లెల్లోని నిరుపేద విద్యార్థికి చదువు ఒక నిరంతర సమస్యే.కరోనా కాలంలో ఆన్ లైన్ చదువుల కోసం మొబైల్స్ కొనలేక వేలాది విద్యార్థుల జీవితాలు అతలాకుతలం అయ్యాయి.అప్పుడు తోపుడుబండి మీ అందరి సహకారంతో చేతనైనంత మందికి మొబైల్స్ అందించగలిగింది. వందలాది విద్యార్థుల జీవితాలను నిలబెట్టింది. లాక్ డౌన్ ముగిసి మళ్లీ బడులు తెరిచాక మరో కొత్త సమస్య పిడుగులా మీద పడింది.
 ఆ సమస్య పేరు నోట్ బుక్స్.ఒక్కో క్లాస్ కు ఆరు సబ్జెక్టులు. ఒక్కో దానికి రెండు నోట్ బుక్స్.ఆరు సబ్జెక్టు లకు 12,రఫ్ వర్క్ కి మరో మూడు.వెరసి 15 నోటుబుక్కులు.ఒక్కోటి 20 రూపాయలు.అంటే ఒక్కో నిరుపేదపై పడుతున్న భారం 300 రూపాయలు.తోపుడుబండి స్కూళ్లలో తిరుగుతున్న  పలు సందర్భాల్లో పిల్లలు ఈ సమస్య గురించి చెప్పి బాధపడుతున్నారు.పల్లెలు,పిల్లలు,పుస్తకాలు అంటూ తిరిగే తోపుడుబండికి పిల్లల కష్టాన్ని చూసి ఏం చేయాలో అర్ధమైంది.మా పరిధిలో 12 స్కూళ్ళు ఉన్నాయి.అక్కడి పిల్లల సంఖ్య,వాళ్ళ అవసరాలు మొత్తం చూసి లెక్కలు వేస్తే 25 వేల నోట్ బుక్స్ అవసరమవుతాయని లెక్కతేలింది.అంటే ఐదు లక్షలు అవసరమవుతాయి.అంతశక్తి మనదగ్గరలేదు.అయినా సాహసం చేసాం.మీరు మాకు తోడుగా ఉన్నారనే మొండి ధైర్యం.
  తొలివిడతగా ఐదువేల నోట్ బుక్స్ ఆర్డర్ ఇచ్చాము.అంటే లక్షరూపాయలు.అవి వచ్చి సిద్ధంగా ఉన్నాయి.సోమవారం నుంచి పంపిణీ ప్రారంభించనున్నాం.మీరంతా సహకరిస్తే మరింతమందికి అందించగలమని అనుకుంటున్నాం.మీ సహాయసహకారాలు ఆర్థిస్తున్నాం. ఈ కార్యక్రమానికి మేము పెట్టుకున్న పేరు 'బడిబడికి తోపుడుబండి'.
కామెంట్‌లు