చిట్టి పొట్టి పిల్లోడు( బాల గేయం):-ఎడ్ల లక్ష్మి-సిద్దిపేట
చిన్న చిన్నగా  ఉన్నాడు
చిట్టి పొట్టి పిల్లోడు
తప్పటడుగులు వేస్తూ
పడుతూ లేస్తూ ఉంటాడు

వచ్చిరాని భాషలో
చిన్న చిన్న మాటలతో
ముద్దులొలికే చిన్నోడు
ముద్దు ముద్దుగున్నాడు

మూడు ఏళ్ల చంటోడు
చిట్టిపొట్టి మాటలతో
బుడి బుడి అడుగులతో
అమ్మ చెంతకు చేరాడు

పాల బువ్వ తిన్నాడు 
బంతి పట్టి ఆడుతూ
అలిసి పోయి చిన్నోడు
హాయిగ నిద్ర పోయాడు


కామెంట్‌లు