బాల గేయం : సత్యవాణీ కుంటముక్కుల
చందమామా పైన బడిని పెట్టేడు

బడియేమొ అచ్చంగ గుడిలాగవుంది            ॥చం॥

చూడగా వెళదాము బాలలూరండి
బడిలోన మనమామ

 పాఠాలుచెప్పు
బయలుదేరెళదాము బాలలూరండీ         ॥చం॥

రాకెట్ లోనెక్కి రయ్ నాపోయి
పాఠాలు విందాము పధ్ధతిగ మనమ
మామ చెప్పును మనకు రోదశీ పాఠం
నేర్చుకొని వద్దాము నేర్పుతో మనము           ॥చం॥

రోదసీ వింతలను వ్రాసుకొద్దాము
ఛాయా చిత్రాలెన్నొ
 తీసుకొద్దాము    
మన చందమామకు టాటాలు చెప్పి
చప్పున క్రిందకూ చక్కగొద్దాము
                              ॥చం॥

                     
               
కామెంట్‌లు