గణపయ్య (గేయం):-ఎడ్ల లక్ష్మి-సిద్దిపేట
గన గన  గంటల మోతలు
గండ దీపాల వెలుగుల్లో
ఏక దంత గణపయ్యా
లోక మంతా తిరుగయ్యా

వీధిలో పూజలు లేవయ్యా
ఇంటింటా దీపాలు నీకయ్యా
గడప లన్ని దాటి రావయ్యా
భక్తుల భజనలు నీకయ్యా

తొమ్మిది రకాల వంటకాలు
తొలుత నీ ముందు పెట్టామూ
దండాలు దండాలు గనపయ్యా
బొజ్జ నిండ నీవు తినవయ్యా

తొమ్మిది రోజులు గణపయ్యా
భక్తితో మేము కొలిచేదమయ్యా
విఘ్నాలు తొలిగించి గణపయ్యా
విజయాలను  నియ్యు గణపయ్యా